: సినిమా సెలబ్రిటీలకు 'పద్మ'పీట!
మోదీ సర్కారు 2016 సంవత్సరానికి గాను ప్రకటించిన పద్మ అవార్డుల్లో సినీ సెలబ్రిటీలకు పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. దక్షిణాదిన సూపర్ స్టార్ గా, ఉత్తరాదికి పరిచయమున్న నటుడిగా కొనసాగుతున్న రజనీకాంత్ తో పాటు, అన్ని భారతీయ భాషల్లోను చిత్రాలను నిర్మించి, రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ప్రపంచంలోనే అత్యాధునిక సినీ స్టూడియో అధినేతగా, మీడియా మొఘల్ గా ఉన్న రామోజీరావుకు భారత రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. వీరితో పాటు బీజేపీ నాయకుడిగా ఎదుగుతున్న బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, గాయకుడు ఉదిత్ నారాయణ్ కు పద్మభూషణ్ అవార్డు లభించింది. ప్రియాంకా చోప్రా, అజయ్ దేవగణ్, బాహుబలి దర్శకుడు రాజమౌళిలకు పద్మశ్రీ ఆవార్డులు లభించాయి. ప్రియాంకా చోప్రా ఇటీవలే ఇన్ క్రెడిబుల్ ఇండియాకు ప్రచారకర్తగా ఎంపికైన సంగతి తెలిసిందే.