: బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియాపై రాజద్రోహం కేసు... రేపు అరెస్ట్?
భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ లో నేటి ఉదయం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, ఆ దేశ పార్లమెంటులో ప్రతిపక్ష నేత ఖలీదా జియాపై రాజద్రోహం కేసు నమోదైంది. అంతేకాక జియా అరెస్ట్ కు రేపు వారెంట్లు జారీ కానున్నాయి. ప్రతిపక్ష నేతపై రాజద్రోహం కేసు ఆ దేశ రాజకీయాలను కుదిపేయనుంది. బంగ్లా విముక్తి పోరులో వీరమరణం పొందిన సైనికులను కించపరిచేలా కామెంట్లు చేసిన కారణంగానే జియాపై రాజద్రోహం కేసు నమోదైనట్లు ఢాకా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు చెందిన ఓ అధికారి చెప్పారు. జియాపై రాజద్రోహం కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి, ఆమె అరెస్ట్ కు సంబంధించి రేపు వారెంట్లు జారీ చేయనున్నారని సదరు అధికారి చెప్పారు.