: 'సిరి గోల్డ్' ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు
నెల్లూరు కేంద్రంగా నడుస్తూ, ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు స్వీకరించిన సిరి గోల్డ్ ఫామ్స్ అండ్ ఎస్టేట్ ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంస్థ అధినేత వేలా సుందరం శెట్టి పేరిట ఉన్న ఆస్తులన్నీ జప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ. 3.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి, వాటిని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బుతో ప్రజల డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో సుందరం శెట్టిపై నమోదైన 8 కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని సూచించింది. కాగా, నెల్లూరు, గూడూరు, కావలి తదితర ప్రాంతాల్లో సుందరం శెట్టిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.