: తండ్రిని ఆకాశానికెత్తేసిన కేటీఆర్... కేసీఆర్ లాంటి వ్యక్తి యుగానికి ఒక్కరే పుడతారని వ్యాఖ్య


టీఆర్ఎస్ యువనేత, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు. టీ టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి కృష్ణా యాదవ్ కొద్దిసేపటి క్రితం కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, తన తండ్రిని పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ లాంటి వ్యక్తి యుగానికి ఒక్కరు మాత్రమే పుడతారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో టీడీపీ, కాంగ్రెస్ లపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. హైదరాబాదు నగరాన్ని ఆ రెండు పార్టీలు నాశనం చేశాయని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News