: కేంద్ర నిర్ణయానికి ప్రణబ్ ఆమోదం... అరుణాచల్ లో అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలన
అరుణాచల్ ప్రదేశ్ లో నేటి ఉదయం రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై నిన్న జరిగిన భేటీలో కేంద్ర కేబినెట్ సుదీర్ఘంగా చర్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్... అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపింది. భేటీ ముగిసిన మరుక్షణమే సదరు నిర్ణయంపై రూపొందించిన ఫైలును ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ కు పంపింది. దీనిని పరిశీలించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీంతో కొద్దిసేపటి క్రితం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.