: న్యాయవాదిగా ఉండవల్లి?... పట్టిసీమపై ‘వట్టి’ తరఫున వాదనలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దాదాపుగా దూరంగానే ఉన్నారు. అయితే ఆయన తాజాగా న్యాయవాది అవతారమెత్తారు. రాయలసీమను రతనాల సీమగా మార్చనుందంటూ ఏపీ సర్కారు తెరపైకి తీసుకొచ్చిన పట్టిసీమ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నేత వట్టి వసంత కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ తరఫున వాదనలు వినిపించేందుకు ఉండవల్లి హైకోర్టును అభ్యర్థించారు. అయితే దీనిపై హైకోర్టు తన స్పందనను వెంటనే తెలియజేయలేదు. తదుపరి విచారణలో దీనిపై తమ నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.