: ప్రతిసారీ ఎలా ఆడతాను... నా తలపై రాసుందా?: ధోనీ విసుర్లు
మహేంద్ర సింగ్ ధోనీ... క్రీజులో ఉంటే స్లాగ్ ఓవర్లలో ఎంత రన్ రేట్ ఉన్నా విజయంపై ధీమాగా క్రికెట్ అభిమానులు ఉంటారు. ఇది ఒకప్పటి మాట. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న ధోనీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా, మీడియాతో మాట్లాడుతూ ఒకింత అసహనాన్ని ప్రదర్శించాడు. ప్రతి ఒక్కరి లక్ష్యం గెలిపించడమేనని, అయితే, ప్రతిసారీ ఆడటం సాధ్యం కాదని అన్నాడు. బౌన్సర్ బాల్ ను హెలికాప్టర్ షాట్ కొట్టలేమని, యార్కర్ ను సిక్స్ గా మలచలేమని అన్నాడు. సిక్స్ కొడితే గొప్పగా చెప్పుకునే వారు, అదే బాల్ కు అవుట్ అయితే, "అలా కొట్టడం అవసరమా?" అని విమర్శిస్తారని అన్నాడు. ఎలా కొడతానన్నది తన నుదిటిపై ఏమైనా రాసుందా? అని ప్రశ్నించిన ధోనీ, ఎప్పుడూ జట్టును గెలిపించడం సాధ్యం కాదని కాస్తంత గట్టిగానే చెప్పాడు.