: అప్పుడే కూతురికి ఈత నేర్పిస్తున్న మార్క్ జుకర్ బర్గ్
తన నెలల బిడ్డ మాక్స్ కు అప్పుడే ఈత నేర్పిస్తున్నారు ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్. పుత్రికోత్సాహంతో పొంగిపోతున్న ఆయన, తన బిడ్డను తొలిసారిగా స్విమ్మింగ్ పూల్ కు తీసుకొచ్చానని, నీటిలో తడవటాన్ని మ్యాక్స్ ఇష్టపడిందని చెబుతూ ఫోటోలు పోస్టు చేశారు. తన కుమార్తె గురించిన విశేషాలను ఎప్పటికప్పుడు మార్క్ అందిస్తూ వస్తున్నారన్న సంగతి తెలిసిందే. పుట్టినప్పటి నుంచి పలు చిత్రాలను ఆయన పోస్ట్ చేశారు. తన బిడ్డకు స్టార్ వార్స్ ఇష్టమని చెబుతూ, ఆపై పక్కనే పడుకొని లాలిస్తూ, తొలిసారి టీకాలు వేయించినప్పుడు... ఇలా ప్రతి విషయాన్ని తన అభిమానులు, ఉద్యోగులు, ఫేస్ బుక్ ఖాతాదారులతో పంచుకుంటున్నారు. ఈ తాజా చిత్రంలో నడుములోతు నీరున్న కొలనులో చేతులతో బిడ్డను పట్టుకుని ఉన్న మార్క్ చిత్రం ఇప్పటికే 16 లక్షలకు పైగా లైక్ లను పొందింది.