: మా వాళ్లు సింహాలు... మా కత్తుల లక్ష్యం కామెరాన్!: ఐఎస్ఐఎస్ తాజా వీడియో
ఫ్రాన్స్ రాజధాని పారిస్ పై దాడి చేసి 130 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదుల గురించిన వీడియోను ఐఎస్ఐఎస్ మీడియా కేంద్రం 'అల్ హయత్' విడుదల చేసింది. పారిస్ దాడి ఘటన చిత్రాలు, అంతకుముందు తమకు చిక్కిన అమాయకులను నిర్దయగా నరికి చంపుతున్న దృశ్యాలను ఉంచింది. ఫ్రెంచ్, అరబ్ భాషల్లో హెచ్చరికలు చేస్తూ, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ను చూపిస్తూ 'మా తల్వార్ల తదుపరి లక్ష్యం' అంది. పారిస్ పై దాడి చేసిన వారిలో నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫ్రాన్స్ పౌరులు, ఇద్దరు ఇరాకీలు ఉన్నారని, వీరంతా సింహాలని వర్ణించింది. యూఎస్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి దేశాలను వదిలిపెట్టబోమని హెచ్చరించింది.