: ఎన్నికల వేళ టీడీపీకి మరో ఎదురుదెబ్బ!... టీఆర్ఎస్ లోకి కృష్ణాయాదవ్


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ కు జరుగుతున్న ఎన్నికలకు ముందు టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పార్టీ తెలంగాణ శాఖ (టీ టీడీపీ) ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి కృష్ణా యాదవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు. అంతేకాక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ లోకి వెళతున్నట్లు ఆయన నిన్న సంచలన ప్రకటన చేశారు. ‘‘తెలంగాణలో టీడీపీని నడిపే సమర్థ నేతలు లేరు. పొత్తుల పేరుతో టికెట్లు అమ్ముకున్నారు. వీటిన్నింటినీ చూడలేకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’’ అని కృష్ణా యాదవ్ ప్రకటించారు. నేడు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.

  • Loading...

More Telugu News