: రాహుల్ గాంధీ చిన్న పిల్లాడు!: యూపీ మంత్రి ఆజం ఖాన్ ఘాటు వ్యాఖ్య


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఆయన చిన్నపిల్లాడిలా అభివర్ణించారు. మొన్న ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. అక్కడి కరవు పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటనపై నిన్న రాంపూర్ లో ఆజం ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లాడిలా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ అక్కడ, ఇక్కడా తిరుగుతూ టైంపాస్ చేస్తున్నారని ఆయన అన్నారు. పర్యటనల్లో రాహుల్ గాందీ తన వెంట చాక్లెట్లు తీసుకెళ్లాలని, వాటిని తాను తింటూ, తనలాంటి చిన్న పిల్లలకు కూడా వాటిని పంచాలని ఆయన సూచించారు. అయినా చిన్నపిల్లాడైన రాహుల్ పర్యటనను తాము అంత సీరియస్ గా తీసుకోవడం లేదని కూడా ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News