: జోరందుకున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం... రాజేంద్రనగర్ లో నేడు లోకేశ్ ప్రచారం


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిన్నటి నుంచి అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే తెలంగాణలో అధికార టీఆర్ఎస్, దాని మిత్రపక్షం మజ్లిస్ లు నగరవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తాజాగా నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రంగంలోకి దిగారు. నిన్న నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన లోకేశ్, నేడు రాజేంద్రనగర్ పరిధిలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.

  • Loading...

More Telugu News