: మామయ్యల పేర్లు ఎప్పుడూ ఎక్కడా నేను చెప్పుకోలేదు!: హీరో సాయి ధరమ్ తేజ్
తాను కాలేజీలో చదువుకునేటప్పుడు కానీ, ఉద్యోగాల కోసం తిరిగినప్పుడు కానీ తన మామయ్యల పేర్లను ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదని మెగా కుటుంబం హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాలేజ్ డేస్ ను ఆయన గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగేంద్రబాబుల మేనల్లుడినని తాను చదువుకున్న కళాశాల్లలో ఎప్పుడూ చెప్పలేదని అన్నాడు. అంతేకాకుండా, ఎంబీఏ చదివిన తర్వాత ఉద్యోగాల వేటలో కూడా వారి పేర్లను ఎప్పుడూ ప్రస్తావించలేదని చెప్పారు. అయితే, పాఠశాల, కళాశాలల్లో చదువుకునేటప్పుడు ముగ్గురు మామయ్యలు తనపై ఎంతో శ్రద్ధ పెట్టేవారన్నారు.