: ‘పాక్’లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయాలి: పాకిస్తాన్ కు ఒబామా హితబోధ


‘పాక్’లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పీకివేయాలని పాకిస్తాన్ కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హితబోధ చేశారు. భారత్ లోని వైమానిక స్థావరం పఠాన్ కోట్ పై ‘ఉగ్ర’ దాడి విషయమై ఒబామాను ఒక వార్తా సంస్థ ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. భారత్ చాలాకాలంగా ఎదుర్కొంటున్న ‘ఉగ్ర’ సమస్యకు మరో ఉదాహరణగా ఈ సంఘటనను పేర్కొనవచ్చన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఒప్పించడం చాలా గొప్ప విషయమని, ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతమయ్యారని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఇరు దేశాల నేతలు చర్చించడం హర్షణీయమన్నారు. భారత్-అమెరికా స్నేహ సంబంధాలను మరింత అభివృద్ధి చేసుకుంటామని ఒబామా పునరుద్ఘాటించారు. అమెరికా కూడా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోందని, ఈ సమస్యను మట్టుబెట్టేందుకు భారత్ తో కూడా కలిసి పనిచేస్తామన్నారు.

  • Loading...

More Telugu News