: ఆ సీన్ కాపీ కొట్టానంటుంటే చాలా బాధనిపిస్తోంది!: సుకుమార్
ఎంతో కష్టపడి తీసిన సినిమాను కాపీ కొట్టి తీశారంటే తనకు చాలా బాధనిపిస్తుందని, కోపమొస్తుందని దర్శకుడు సుకుమార్ అన్నారు. ఆయన చిత్రాలపై హాలీవుడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో కూడా ఒక హాలీవుడ్ సీన్ పెట్టారన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఆలోచించి కష్టపడి తీసిన సినిమాపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని, కాపీ కొట్టాలనుకునేవాడినే అయితే ఆలోచించే వాడిని కాదని, 'కాపీ-పేస్ట్' పద్ధతిని అనుసరించి ఉండేవాడినని సుకుమార్ అన్నారు.