: హార్డ్ వర్క్ కు మారుపేరు కత్రినా కైఫ్: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్ టాలెంట్ కు తాను కూడా భయపడ్డానని సల్మాన్ ఖాన్ చెప్పాడు. జాతీయ టెలివిజన్ ఛానెల్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఈ విషయాన్ని తెలిపాడు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించాడు. కత్రినా కైఫ్ డ్యాన్స్ స్కిల్స్, అభినయం అద్భుతంగా ఉంటాయన్నాడు. పదహారేళ్ల వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కత్రినా కైఫ్ ఉన్నతస్థాయికి ఎదగడానికి కారణం ఆమె కఠోర పరిశ్రమేనని సల్మాన్ అన్నాడు. దేవుడు ప్రత్యక్షమై టాలెంట్, హార్డ్ వర్క్ లలో ఏది కావాలని తనని అడిగితే రెండో దానికే మక్కువ చూపుతానని సల్మాన్ అనడంతో.. కత్రినా స్పందించింది. తనకు టాలెంట్ కూడా ఉందని, కాకపోతే కొద్ది మొత్తంలోనే అది ఉందని చెప్పింది. అందుకు సల్మాన్ స్పందిస్తూ.. కష్టపడుతుంటే టాలెంట్ కూడా మెరుగుపడుతుందని అన్నాడు.