: 'ఖలీఫా ఉల్ ఏ హింద్' సౌత్ చీఫ్ ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ!


హైదరాబాద్ లో ఖలీఫా ఉల్ ఏ హింద్ సౌత్ ఇండియా చీఫ్ నజీబ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. నజీబ్ నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఖలీఫా ఉల్ ఏ హింద్ ఇండియా చీఫ్ మున్వర్ అబ్బాస్ ఆదేశాలతో రిపబ్లిక్ డే సందర్భంగా పలు పేలుళ్లకు నజీబ్ కుట్ర పన్నాడు. భారత్ లోని యువతకు సోషల్ నెట్ వర్క్ ద్వారా ఉగ్రవాద సంస్థలు వల వేస్తున్న విషయం తెలిసిందే. ఈ పద్ధతిలో హైదరాబాద్ లో సుమారు 10 మందిని నజీబ్ తన వైపు తిప్పుకున్నాడు. సౌత్ ఇండియా అంతటా నజీబ్ తన నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. కాగా, గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులు కూడా ఈ నెట్ వర్క్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News