: జాతీయ సాహస బాలల పురస్కారం అందుకున్న తెలంగాణ చిన్నారులు


జాతీయ సాహస బాలల పురస్కారాలను ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు అందజేశారు. తెలంగాణకు చెందిన సాహసబాలలు రుచిత, కిలాంబి సాయికృష్ణ అఖిల్ లు మోదీ చేతుల మీదుగా ఈ పురస్కారాలను, జ్ఞాపికలను అందుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, జీవన విధానంలో సాహసాలు చేయడం అలవర్చుకోవాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో సాహసాలు చేసే అవసరం రావచ్చని మోదీ అన్నారు. కాగా, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక రుచిత... గతంలో మాసాయిపేట వద్ద రైలు, పాఠశాల బస్సును ఢీకొన్న సమయంలో తన తోటి చిన్నారులను రక్షించింది. సాహసాన్ని కనబరచిన రుచితను గీతా చోప్రా అవార్డు వరించింది.

  • Loading...

More Telugu News