: '24' సినిమా మరో పోస్టర్ విడుదల.. డిఫరెంట్ లుక్ లో సూర్య!
దక్షిణాది హీరో సూర్య నటిస్తున్న ‘24’ చిత్రం మరో పోస్టర్ ను ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ లో సూర్య డిఫరెంట్ లుక్ లో కనపడుతున్నాడు. ‘మనం’ చిత్రం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘24’. సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ‘24’ చిత్రం ఫస్ట్ లుక్ తో ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెంచింది.