: గేల్ ను నిలువరించడం ఎలా?: గవాస్కర్ చిట్కా


మొన్న బెంగళూరులో క్రిస్ గేల్ ధ్వంస రచన చూశారా!? బంతికి, బౌలర్లకు చాకిరేవు పెట్టాడు. కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి రికార్డులు తిరగరాశాడు. ఆ మ్యాచ్ లో గేల్ చూపంతా స్టాండ్స్ పైనే ఉన్నట్టుంది, ఎక్కువగా సిక్సర్లే బాదాడు. బౌలర్ బంతి వేయడం ఆలస్యం.. మరుక్షణం మాయమయ్యేది! వెతికిచూస్తే స్టాండ్స్ లో దొరికేది! దీంతో, ఎక్కడ బంతి వెయ్యాలో తెలియక బౌలర్లు, ఫీల్డర్లను ఏ స్థానంలో నిలపాలో తెలియక పుణే కెప్టెన్.. తలలు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తనదైన రీతిలో స్పందించారు. ఏప్రిల్ 27న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ఆడనుంది. ఆ పోరులో గేల్ ను నిలువరించాలంటే ముంబయి ఏం చేయాలో చెబుతానని ముందుకొచ్చాడు!

గేల్ బ్యాటింగ్ చేసే సమయంలో ఫీల్డర్లను మైదానంలో ఉంచకూడదట! వారిని స్టాండ్స్ లో మోహరిస్తే గేల్ కొట్టే షాట్లని చక్కగా ఫీల్డింగ్ చేస్తారని సలహా ఇచ్చాడు! పైగా, గేల్ కొట్టేది భారీ సిక్సులే కాబట్టి వాటిని పట్టుకోవడానికి అక్కడ ఉండడమే మేలని సన్నీ సూచించాడు, కాస్త వ్యంగ్యం జోడించి!ఎందుకంటే, గేల్ తుపాను స్టార్టయితే బంతి ల్యాండయ్యేది అక్కడే కదా!.

  • Loading...

More Telugu News