: ఇండియాలో కొత్త ఉగ్రసంస్థ జనూద్-ఉల్-కలీఫ్-ఏ-హింద్
ఇండియాలో మరో కొత్త ఉగ్రవాద సంస్థ ఏర్పాటైందని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర కేంద్రంగా 'జనూద్-ఉల్-ఖలీఫా-ఏ-హింద్' పేరిట ఇది మొదలైందని అధికారులు గుర్తించారు. ముంబైకి చెందిన మునాబిర్ ముస్తాక్ దీన్ని మొదలు పెట్టాడని, భారత్ లో ఉగ్రదాడులు జరపడం, ఐఎస్ఐఎస్ కు నిధులు మళ్లించడం ఈ సంస్థ ప్రదాన కర్తవ్యమని అధికారులు తెలిపారు. దీంతో పాటు దేశానికి వచ్చే విదేశీయులను హతమార్చాలని ఈ సంస్థ పన్నాగాలు పన్నుతోందని వివరించారు. ఇటీవల ఉగ్ర అనుమానితుల పేరిట అదుపులోకి తీసుకున్న వారిని ప్రశ్నిస్తే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ సంస్థ గురించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు.