: టీవీ షో కోసం భయంకర సాహసం చేసిన అర్జున్ కపూర్
ఓ టీవీ చానల్ రియాలిటీ ప్రదర్శన కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఒళ్లు గగుర్పొడిచే సాహసానికి పూనుకున్నాడు. ఆ షోకు హోస్ట్ గా ఉన్న అర్జున్ తొలి ఎపిసోడ్ లోనే తన సాహసాన్ని ప్రదర్శించాడు. ముఖానికి తీయ్యటి క్రీమ్ రాసుకుని తేనెటీగలున్న పెట్టెలో తల పెట్టి అందులో ఉంచిన స్ట్రాబెరీ పండ్లను తిన్నాడు. గాజు తొట్టిలో తల పెట్టిన తరువాత, తేనెటీగలు అర్జున్ కపూర్ ముఖంపై ఉన్న క్రీమ్ ను రుచి చూస్తుండగా, అర్జున్ అందులోని స్ట్రాబెరీ పండ్లను ఒక్కొక్కటిగా లాగించాడు. ఈ క్రమంలో తేనెటీగలకు ఏ మాత్రం అనుమానం వచ్చినా, అర్జున్ ప్రాణాలమీదకు వచ్చేది. ఇక ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నందుకు షో నిర్వహకులు తమకు అసలు సిసలైన యాంకర్ లభించాడని అర్జున్ ను పొగడ్తలతో ముంచెత్తారు.