: గుజరాత్ లో లభించిన డైనోసార్ శిలాజం!


ఒకప్పుడు ఇండియాలోనూ డైనోసార్లు తిరిగాయనడానికి మరో సాక్ష్యం లభించింది. గుజరాత్ లోని కచ్ రీజియన్లో జర్మనీ, జియాలజిస్టుల బృందంతో కలిసి తవ్వకాలు జరుపుతుండగా డైనోసార్ శిలాజాలు కనిపించడంతో ఆశ్చర్యపోయినట్టు భారత జియాలజిస్ట్ గౌరవ్ చౌహాన్ మీడియాకు తెలిపారు. భుజ్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో డైనోసార్ ఎముకలు లభించాయని, ఇది ఎంతకాలం క్రితం మరణించిందో తెలుసుకునేందుకు ప్రస్తుతం కార్బన్ డేటింగ్ పరీక్షలు జరుపుతున్నామని వివరించారు. గుజరాత్ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు డైనోసార్ల శిలాజాలు లభించిన సంగతి తెలిసిందే. గతంలో అహ్మదాబాద్ కు 100 కి.మీ దూరంలో భారీసంఖ్యలో డైనోసార్ గుడ్లు కూడా వెలుగుచూశాయి. ముఖ్యంగా నర్మదా నది తీరంలో డైనోసార్లు తిరుగాడాయని పురాతత్వవేత్తలు నమ్ముతున్నారు.

  • Loading...

More Telugu News