: దూసుకొస్తున్న డేటింగ్ యాప్స్!


యువతీ యువకుల మధ్య ప్రేమ ఎక్కడ పుడుతుంది? అదేం ప్రశ్న... బడి నుంచి గుడి వరకూ ఎక్కడైనా పుట్టొచ్చంటారా? నిజమే. కానీ ఇవాళ, రేపు గుళ్లకు వెళ్లి అమ్మాయిలకు లైనేసే కుర్రకారు ఎంతమంది ఉంటారు? ఇక కాలేజీల్లో ప్రేమ పుట్టినా, చాలా వరకూ కాలేజీ చదువు ముగిసే వరకే అది పరిమితం. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ప్రేమ పుట్టించే కేంద్రాలుగా సామాజిక మాధ్యమాలు మారిపోగా, ప్రత్యేకించి ప్రేమికుల కోసమే ఎన్నో యాప్స్ వచ్చేశాయి. భవిష్యత్తంతా డేటింగ్ యాప్స్ దేనని అంటున్నారు 'వూ' యాప్ సృష్టికర్త సుమేశ్ మీనన్. ఒకే రకమైన భావాలు, అభిప్రాయాలు ఉన్న వారి మధ్య అనుసంధానంగా పనిచేస్తున్న పలు యాప్స్ ను తమ స్మార్ట్ ఫోన్లలో యువత నిక్షిప్తం చేసుకుంటోంది. వీటిని లోడ్ చేసుకుంటున్న వారిలో 43 శాతం మంది అమ్మాయిలు ఉన్నారని ఓ అంచనా. టిండర్, థ్రిల్, ఓకే కూపిడ్ వంటి యాప్స్ డేటింగ్ సేవలను అందిస్తున్నాయి. అయితే, ఈ యాప్స్ పై యువత భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. ఇవి భావోద్వేగాలు పంచుకునేందుకు ఉపయోగపడుతున్నాయే తప్ప, మనసులను కలపలేవని యువతులు అంటుండగా, ఎక్కడెక్కడో ఉండే ఒకే అభిప్రాయాలున్న వారిని దగ్గర చేసేందుకు ఈ యాప్స్ బెస్టన్నది యువకుల భావన. ఏది ఏమైనా వచ్చే ఆరు నెలల వ్యవధిలో డేటింగ్ యాప్స్ లోడ్ చేసుకునేవారి సంఖ్య రెట్టింపవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News