: తమిళనాట కలకలం... కాలేజీ యాజమాన్యం వేధిస్తోందంటూ, ముగ్గురు వైద్య విద్యార్థినుల ఆత్మహత్య!


తమిళనాడులోని విల్లుపురంలో తాము విద్యను అభ్యసిస్తున్న కాలేజీకి సమీపంలోని బావిలో ముగ్గురు విద్యార్థినులు విగత జీవులుగా కనిపించడం కలకలం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరు ముగ్గురూ చెన్నైకి 200 కి.మీ దూరంలోని విల్లుపురంలో ఉన్న ఎస్ వీఎస్ మెడికల్ కాలేజ్ ఆఫ్ నాచురోపతి అండ్ యోగా సైన్సెస్ విద్యార్థులు. కాలేజీ మేనేజ్ మెంట్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తోందని, ముఖ్యంగా చైర్ పర్సన్ తమను ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తూ వీరు ఆత్మహత్య చేసుకున్నారు. మరణించే ముందు ఈ వివరాలన్నీ తెలుపుతూ లేఖను కూడా రాశారు. తమకు సరైన సౌకర్యాలు కూడా కల్పించలేదని వారు ఆరోపించారు. విద్యార్థినులు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నామని, విచారణ జరుపుతున్నామని, ప్రస్తుతానికి ఎవరినీ అరెస్ట్ చేయలేదని జిల్లా ఎస్ పీ నరేంద్ర నాయర్ తెలిపారు. హైదరాబాద్ లో రోహిత్ ఆత్మహత్య, ఆపై పెల్లుబికిన నిరసనల నేపథ్యంలో ఎస్ వీఎస్ కళాశాలలోనూ విద్యార్థినుల ఆత్మహత్యపై నిరసనలు మొదలయ్యాయి.

  • Loading...

More Telugu News