: నేడు భారత్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు... కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు


ఓ వైపు దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్. విస్తృతంగా సోదాలు, పదుల సంఖ్యలో ఉగ్రవాదులన్న అనుమానాలతో అరెస్టుల మధ్య భారత పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఇండియాకు రానున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. నేడు చండీగఢ్ లో దిగనున్న ఆయన, 'ఇండియా-ఫ్రాన్స్' బిజినెస్ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆపై ఢిల్లీకి వెళ్లి ప్రముఖ స్థలాలను సందర్శిస్తారు. తన గౌరవార్థం ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో జరిగే విందుకు హాజరౌతారు. ఆపై మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. కాగా, హోలాండే పర్యటన సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంత భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్ఐఏ, బీఎస్ఎఫ్, ఆర్పీఎఫ్ దళాలతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News