: 'బాహుబలి' ఓ చెత్త సినిమా అంటున్న మహానటి
ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని, కలెక్షన్లను సాధించిన రాజమౌళి అద్భుత సృష్టి 'బాహుబలి' చిత్రం మహానటి జమునకు ఎంతమాత్రమూ నచ్చలేదు. ఆమె దాన్ని ఓ చెత్త చిత్రంగా అభివర్ణించారు. తాను సినిమాలు చూడక చాలా కాలమైందని, మనవడి కోరిక మేరకు 'బాహుబలి' చూశానని చెప్పిన ఆమె, అదో 'స్టుపిడ్' చిత్రమన్నారు. సినిమా గురించి చెప్పేందుకు తనకు అంతకన్నా మరో పదం దొరకలేదని వెల్లడించిన జమున, టెక్నాలజీ తప్ప ఆ చిత్రంలో మరేమీ లేదని అన్నారు. ఒక్క హీరో పాత్ర తప్ప మిగతా పాత్రలకు నటీనటుల ఎంపిక సరిగ్గా జరగలేదని జమున అభిప్రాయపడ్డారు.