: అసభ్య ప్రవర్తన.. జేడీ(యు) ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు!


అసభ్య ప్రవర్తనకుగాను జేడీ(యు) ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని జేడీ(యు) బీహార్ అధ్యక్షుడు వశిస్ట్ నరేన్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేపై ఆరోపణల నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జేడీ(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ సమావేశమయ్యారని తెలిపారు. ఆలం ప్రవర్తన కారణంగా పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన వారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కాగా, వారం రోజుల క్రితం గువహటి రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఇందర్ పాల్ సింగ్ బేడి, ఆయన భార్యతో ఆలం అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయమై పాట్నా రైల్వే స్టేషన్ లో బాధిత దంపతులు ఫిర్యాదు చేశారు. ఆలంతో పాటు ఆయన అంగరక్షకులు కూడా తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులు, ప్రత్యక్షసాక్షుల నుంచి మరింత సమాచారాన్ని సేకరించినట్లు పాట్నా రైల్వే ఎస్పీ పీఎన్ మిశ్రా తెలిపారు.

  • Loading...

More Telugu News