: రేపటి హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ ప్రెస్ 7 గంటలు ఆలస్యం!
రేపటి హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ ప్రెస్ 7 గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రేపు ఉదయం 6.25కు బదులుగా మధ్యాహ్నం 1.30 గంటలకు తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాదు నుంచి బయలుదేరుతుంది. రైలు ఆలస్యం కారణంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా ఉండేందుకని వారి సౌకర్యార్థం ఈ సమాచారాన్ని ముందుగా తెలియజేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఇన్ని గంటలు ఆలస్యంగా నడవనుండటానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.