: నేతాజీ సోదరుడికి నెహ్రూ రాసిన లేఖలో ఏముందంటే..!


నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతి చెందారన్న విషయాన్ని భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఒక లేఖ ద్వారా నేతాజీ సోదరుడు సురేష్ బోస్ కు తెలిపారు. 1962 మే 13న ఈ లేఖ రాసినట్లు తాజా ఫైళ్ల ద్వారా తెలుస్తోంది. నేతాజీ మృతికి సంబంధించిన మరికొన్ని ఫైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ బయటపెట్టారు. నేతాజీ మరణం గురించి కచ్చితమైన, ప్రత్యక్షమైన ఆధారాలేవీ తాను పంపలేకపోతున్నానని, అయితే, ఇందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం విచారణ కమిషన్ కు అందజేశానని ఆ లేఖలో నెహ్రూ పేర్కొన్నారు. నేతాజీ బతికి ఉంటే ఆయనను ఆనందంతో ఇక్కడికి ఆహ్వానించవచ్చని, కానీ, అటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నెహ్రూ రాశారు. విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందారనే విషయాన్నే పశ్చిమదేశాలు కూడా చెబుతున్నాయని ఆ లేఖలో నెహ్రూ రాసినట్లు ఈ ఫైళ్ల ద్వారా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News