: రాజమండ్రిలో నమోదైన కేసులో చెవిరెడ్డికి బెయిలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నమోదైన కేసులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజమండ్రి మూడవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి బెయిల్ మంజూరు చేశారు. సంవత్సరం కిందట ప్రత్యేక హోదా బంద్ సందర్భంగా వైసీపీ నేతల అరెస్టులపై మీడియా సమావేశంలో చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయనపై కేసు నమోదైంది. దాంతో నెల్లూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను రాజమండ్రి తీసుకొచ్చిన పోలీసులు ఇవాళ జడ్జి ముందు హాజరుపరిచారు. దాంతో ఆయనకు బెయిలు మంజూరైంది. ఆ వెంటనే మళ్లీ నెల్లూరు జైలుకు తరలించారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అనైతిక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, వైసీపీ తరపున ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చెప్పారు.