: కృష్ణాజిల్లా నందిగామలో కాల్ మనీ వేధింపులు... మహిళ ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్ లో కాల్ మనీ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుని పలువురిని అరెస్టు చేసినా కొన్ని ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు అలాగే ఉన్నాయి. ఇవాళ కృష్ణాజిల్లా నందిగామలో కాల్ మనీ వేధింపులను భరించలేక శిరీష అనే మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. 2007లో ఓ వడ్డీ వ్యాపారి వద్ద ఆమె లక్షా ముప్పై వేలు అప్పుగా తీసుకుంది. ఈ అప్పును చెల్లించే క్రమంలో ఇప్పటివరకు రూ.12 లక్షలు వడ్డీ వ్యాపారికి కట్టానని, అయినప్పటికీ ఇంకా డబ్బు ఇవ్వాలని వేధిస్తున్నాడని పోలీసులకు తెలిపింది. అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడ్డానని వివరించింది.