: గవర్నర్ పై మధుయాష్కీ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ గా ఉంటూ సిగ్గులేకుండా టీఆర్ఎస్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన విమర్శించారు. అసలు గవర్నర్ ఏ హోదాలో ఇటీవల తెలంగాణలో వాటర్ గ్రిడ్ పరిశీలన చేశారని ప్రశ్నించారు. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ చనిపోతే ఇంతవరకు ఎందుకు స్పందించలేదని సూటిగా అడిగారు. దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదన్నారు.