: జీజీహెచ్ లో మంత్రి కామినేని ఆపరేషన్ పై వైసీపీ ఆరోపణలు


ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాలి చిప్ప ఆపరేషన్ చేయించుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. గుంటూరులో ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, మంత్రిగారు జీజీహెచ్ లో ఆపరేషన్ చేయించుకున్నారని ప్రచారం జరుగుతోందన్నారు. ఆయన బయట నుంచి వైద్యులను తెప్పించుకుని అక్కడ ఆపరేషన్ చేయించుకున్నారని విమర్శించారు. రోగులకు, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించేందుకే ఇలా చేసినట్టు ప్రచారం చేస్తున్నారని, అయితే మంత్రిగారి నిర్వాకం వల్ల జీజీహెచ్ ప్రతిష్ఠ మరింత దిగజారిందని మండిపడ్డారు. డాక్టర్లేమో బయటవారు, బెడ్ లు మాత్రం ప్రభుత్వానివా? ఇలా చేస్తే ప్రభుత్వ ఆసుపత్రి పరువు ప్రతిష్ఠలు పెరుగుతాయా? అని అంబటి ప్రశ్నించారు. అసలు మంత్రిగారు మోచిప్ప మార్పిడి కన్నా మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News