: సెంచరీ ముంగిట రోహిత్ ను బలిగొన్న హేస్టింగ్స్


టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను సెంచరీ ముంగిట ఆసీస్ బౌలర్ హేస్టింగ్స్ బలిగొన్నాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో భారత జట్టు ధాటిగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ (99), ధావన్ (76) దూకుడుగా ఆడడంతో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. ధావన్ ను అద్భుతమైన క్యాచ్ తో షాన్ మార్స్ పెవిలియన్ బాటపట్టించగా, అనంతరం కోహ్లీని కీపర్ క్యాచ్ తో హేస్టింగ్స్ అవుట్ చేశాడు. అనంతరం టీమిండియా బ్యాటింగ్ బాధ్యతను భుజాన వేసుకున్న రోహిత్ శర్మకు అద్భుతమైన బంతిని సంధించిన హేస్టింగ్స్... కీపర్ వేడ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇప్పటివరకు 35 ఓవర్లు ఆడిన భారత జట్టు మూడు వికెట్లు నష్టపోయి 232 పరుగులు చేసింది. 88 బంతుల్లో 99 పరుగులు చేయాల్సి ఉండగా, ఆసీస్ బౌలర్లలో హేస్టింగ్స్ మూడు వికెట్లతో రాణించడం విశేషం. క్రీజులో మనీష్ పాండే (46), ధోనీ ఉన్నారు.

  • Loading...

More Telugu News