: బాలీవుడ్ లో 'అసహనం' లాంటిదేమి లేదు: కాజోల్


దేశంలో మత అసహనంపై పలువురు బాలీవుడ్ నటులు గతేడాది దీనికి సానుకూలంగాను, వ్యతిరేకంగాను స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండే కాజోల్ ఇప్పుడు అసహనంపై మాట్లాడింది. గత మూడు రోజులుగా రాజస్థాన్ లోని జయపురలో లిటరేచర్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ, బాలీవుడ్ లో అసహనం లాంటిదేమి లేదని స్పష్టం చేసింది. ఈ సమాజంలో ఏం జరిగినా అది తమ సినీ పరిశ్రమపైనే ప్రతిబింబిస్తుందని, ఎలాంటి విషయాన్నైనా తాము స్వాగతిస్తామని తెలిపింది. బాలీవుడ్ లో కులం, మతం అంటూ విభేదాలు లేవని, అసహనం అంతకన్నా లేదని కాజోల్ పేర్కొంది. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రజలు చాలా సున్నితంగా ఉంటున్నారని, అందుచేత ప్రముఖులు ఎప్పుడూ మంచి మాత్రమే మాట్లాడాలని సూచించింది. దాంతో జయపుర లిటరేచర్ లో దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడిన దానికి కాజోల్ కౌంటర్ ఇచ్చినట్టుగా ఉందని అంతా అంటున్నారు.

  • Loading...

More Telugu News