: భలే మంచి చౌక బేరము...రెండు లక్షలకే ఆడి కారు!


భలే మంచి చౌక బేరము... అంటూ చెన్నై వాసులు ముచ్చటపడిపోతున్నారు. తాజాగా చెన్నైని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెన్నై నగరం మొత్తం నీటమునిగింది. ఇంచుమించు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీటితో నిండిపోవడంతో రోడ్లు, పార్కింగ్ ప్లేస్ లలో పెట్టిన కార్లు నీటిలో ఉండిపోయాయి. దీంతో కార్లన్నీ షెడ్డుకు చేరాయి. పలు కార్ల సంస్థలు వాటిని బాగుచేసేందుకు ముందుకు వచ్చాయి. ఇలా 30 వేల కార్లు నీటమునగగా, 10 వేల కార్ల ఇంజన్లు పనికిరాకుండా పోయాయి. దీంతో వినియోగదారులు బీమా కంపెనీలకు అప్పగించి బీమా క్లెయిమ్ చేసుకున్నారు. ఈ పది వేల కార్లను బాగుచేయడం తమ వల్ల కాదని మెకానిక్ లు చేతులెత్తేయడంతో వీటిని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి దగ్గర్లోని గోరాట్రక్ పార్కింగ్ మైదానంలో పెట్టారు. వీటికి ధర నిర్ణయించి ఆన్ లైన్ ద్వారా కార్ల కంపెనీ యాజమాన్యాలు అమ్మకం చేపట్టాయి. దీంతో టాప్ బ్రాండ్ కార్లైన బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్, బెంట్లీ, హమ్మర్ వంటి కార్లు కేవలం 2 నుంచి 3 లక్షల రూపాయలకే లభ్యమవుతున్నాయి. వీటిని బాగుచేయడం తమ వల్ల కాదని చెబుతున్నా, వీటిని కొనుగోలు చేసేందుకు కస్లమర్లు ఎగబడడం విశేషం. తమకు తెలిసిన వారితో బాగుచేయించుకుంటామని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News