: అవును నిజం...ఈ చేపలకు 'ఈత'రాదు!
చేపకు ఈత నేర్పాలా? అంటుంటారు. అంటే, నీటిలోనే పుట్టే చేపకు జన్మతః ఈత దానికదే వచ్చేస్తుంది. అయితే ఈత రాని చేపలు కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఇక్కడ నమ్మాలి మరి.. ఎందుకంటే, హ్యాండ్ ఫిష్, బ్యాట్ ఫిష్ అనే జాతులకు చెందిన చేపలకు ఈదడం రాదు. ఇవి సముద్రంలోని అట్టడుగున వేగంగా నడుస్తాయి. ఆస్ట్రేలియా తీరప్రాంతాల్లో కనిపించే ఈ చేపలకు ఈతకొట్టడం రాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికి మొప్పల స్ధానంలో పొడుచుకొచ్చిన కండరాలు ఉంటాయని, ఇవి చేతుల ఆకారంలో ఉండి, నడిచేందుకు ఇవి సహాయపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి చేపలు మొత్తం 14 జాతులు ఉన్నాయని వారు వెల్లడించారు. నీటి అట్టడుగున ఉండే చిన్న జీవులను ఇవి ఆహారంగా తీసుకుంటాయని వారు వివరించారు.