: ఈ నెల 30న పరేడ్ గ్రౌండ్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ


గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 30న పరేడ్ గ్రౌండ్స్ లో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News