: నేతాజీకి సంబంధించిన 100 రహస్య పత్రాలు విడుదల
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన 100 రహస్య డిజిటల్ పత్రాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో విడుదల చేశారు. నేతాజీ 119వ జయంతి సందర్భంగా విడుదలైన ఈ పత్రాలను ఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ లోని ప్రత్యేక గ్యాలరీలో సందర్శకులు చూసే విధంగా ఉంచారు. ఈ కార్యక్రమంలో 20 మంది నేతాజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ పత్రాలన్నింటినీ మోదీ పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పార్లమెంటులోని నేతాజీ చిత్రపటానికి మోదీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.