: యూఎస్ లో పర్యటించే ఉద్దేశమేంటో భారతీయ విద్యార్థులు స్పష్టంగా చెప్పాలి: అమెరికా దౌత్య సలహాదారు


ఇటీవల పలువురు భారతీయ విద్యార్థులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కు తిప్పి పంపిన నేపథ్యంలో ఆ దేశ దౌత్య వ్యవహారాల సలహాదారు జోసఫ్ ఎం.పాంపర్ వివరణ ఇచ్చారు. సరైన భారతీయ విద్యార్థులను అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకోబోమని స్పష్టం చేశారు. అసలు అమెరికాలో ప్రవేశించాలనుకొనే భారతీయ విద్యార్థులు తమ పర్యటన ఉద్దేశమేమిటో ఇమిగ్రేషన్ అధికారులకు స్పష్టంగా తెలియజేయాలని చెన్నైలో ఆయన చెప్పారు. విదేశీ విద్యను కొనసాగించడంలో ఎడ్యుకేషన్ 'యూఎస్ఏ' వంటి అధికారిక, గుర్తింపు పొందిన వేదికలను ఉపయోగించుకోవాలని దౌత్య సలహాదారు సలహా ఇచ్చారు. దానివల్ల అధికారికమైన సమాచారం పొందేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News