: రాజమండ్రిలో లోకేశ్ బర్త్ డేకి కేక్ కట్ చేసిన బాలకృష్ణ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా 'బర్త్ డే కేకు'ను ఆయన మామ, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ రాజమండ్రిలో కట్ చేశారు. తాజా చిత్రం 'డిక్టేటర్' విజయయాత్రలో భాగంగా బాలయ్య రాజమండ్రి వెళ్లారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, తన 100వ చిత్రానికి ప్రత్యేక ప్లాన్ అంటూ ఏమీ లేదన్నారు. ఏదేమైనా మంచి కథతో వందవ చిత్రం చేస్తానని చెప్పారు. జీహెచ్ఎంసీలో ప్రచారంపై హైదరాబాద్ వెళ్లాక నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.