: రోహిత్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం: కేటీఆర్ హామీ
హైదరాబాద్ సెంట్రల్ విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా మంత్రి స్పందించారు. రోహిత్ ఆత్మహత్య బాధాకరమని, ఘటనను రాజకీయం చేయడం సరికాదని ఆయన అన్నారు. ఉద్రేకాలు పెరిగేలా రెచ్చగొట్టవద్దని ఇతర పార్టీలకు కేటీఆర్ హితవు పలికారు.