: జీజీహెచ్ లో పల్లె రఘునాథరెడ్డి... ఓపీ చీటి రాయించుకుని బీపీ చెక్ చేయించుకున్న వైనం


సర్కారీ ఆసుపత్రిలో మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న ఏపీ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. గుంటూరులోని ప్రసిద్ధ జీజీహెచ్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఇంకా అక్కడే ఉన్నారు. కామినేనిని పరామర్శించేందుకు కొద్దిసేపటి క్రితం జీజీహెచ్ కు వచ్చిన ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అక్కడి వైద్యులతో పాటు జనాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆసుపత్రికి వచ్చిన పల్లె నేరుగా ఓపీ విభాగానికి వెళ్లి సాధారణ పేషెంట్ లాగానే ఓపీ చీటి రాయించుకున్నారు. అక్కడి నుంచి వైద్యుడి వద్దకు వెళ్లిన పల్లె, ఓపీ చీటిని అందజేసి బీపీ చెక్ చేయించుకున్నారు.

  • Loading...

More Telugu News