: గ్రేటర్ లో టీడీపీకి మరో షాక్... శేరిలింగంపల్లి నేత బండి రమేశ్ రాజీనామా
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఝలక్ ఇస్తున్నారు. నిన్న (శుక్రవారం) ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణాయాదవ్ టికెట్ల కేటాయింపులో తనను పట్టించుకోలేదని రాజీనామా చేశారు. తాజాగా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, శేరిలింగంపల్లి నేత బండి రమేశ్ రాజీనామా చేశారు. తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ రోజు ఆయన తన అనుయాయులతో కలసి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.