: ఎయిర్ హోస్టెస్, ప్యాసింజర్ల మధ్య ఘర్షణ... ప్రయాణికులను వదిలేసి వెళ్లిన ఇండిగో ఫ్లయిట్


హైదరాబాదు నుంచి రాయ్ పూర్ వెళ్లేందుకు నేటి ఉదయం శంషాబాదు ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ షాకిచ్చింది. మరికాసేపట్లో టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో అప్పటికే విమానంలోకి ఎక్కేసిన ప్రయాణికులు, ఎయిర్ హోస్టెస్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో విమాన సిబ్బంది ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనికి నిరసనగా విమానం దిగేసిన ప్రయాణికులు రన్ వే పైనే ఆందోళనకు దిగారు. ప్రయాణికులకు సర్దిచెప్పాల్సిన విమాన సిబ్బంది అదేమీ పట్టించుకోలేదు. టికెట్లు కొన్న ప్యాసింజర్లను అక్కడే వదిలేసిన ఫ్లయిట్ రాయ్ పూర్ కు టేకాఫ్ తీసుకుంది. దీంతో షాక్ తిన్న ప్రయాణికులు ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఎయిర్ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. పరిస్థితిని సమీక్షించిన అధికారులు నేటి ఉదయం 10 గంటలకు మరో ఫ్లయిట్ లో రాయ్ పూర్ పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే వేచి చూడక తప్పలేదు.

  • Loading...

More Telugu News