: టాస్ టీమిండియాదే!... ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ కూల్
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ లో భాగంగా మరికాసేపట్లో టీమిండియా చివరి వన్డేకు సిద్ధమైంది. ఇప్పటికే ఆడిన నాలుగు వన్డేల్లో చిత్తుగా ఓడిన టీమిండియా చివరి వన్డేలోనైనా గెలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు సంబంధించి టాస్ ముగిసింది. టాస్ నెగ్గిన మహేంద్ర సింగ్ ధోనీ ఫస్ట్ బ్యాటింగ్ కు బదులుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య జట్టు ఆసీస్ ను ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.