: హెచ్ సీయూ ఆందోళనకారులను ‘కుక్కలు’గా అభివర్ణించిన సుబ్రహ్మణ్యస్వామి


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు తెర తీసింది. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వర్సిటీల్లో కుల వివక్ష, సాంఘిక బహిష్కరణలపై చర్చ నడుస్తోంది. ఈ విషయంపై నిన్నటిదాకా సైలెంట్ గానే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు నోరు విప్పారు. దేశం తన ముద్దుబిడ్డను కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఆవేదనాభరిత వ్యాఖ్యలకు ముందు.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యను నిరసిస్తూ సెంట్రల్ వర్సిటీలో ఆందోళనలకు దిగిన విద్యార్థులను ఆయన 'కుక్కలు’గా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీ ప్రసంగానికి కాస్తంత ముందుగా ట్విట్టర్ లో ఈ ఘాటు వ్యాఖ్యలను పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News