: మరో వివాదంలో కేంద్ర మంత్రి వీకే సింగ్... కరణ్ జోహార్ ను చితక్కొట్టండంటూ కామెంట్!
కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. అసహనంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ డైరెక్టర్ 'కరణ్ జోహార్ ను చితక్కొట్టండి' అంటూ ఆయన వ్యాఖ్యానించి మీడియా ప్రతినిధులకు షాకిచ్చారు. నిన్న సాయంత్రం జైపూర్ వచ్చిన సందర్భంగా కరణ్ జోహార్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడగ్గా అందుకు ఆయన ఆవేశంతో స్పందించారు. ‘‘కరణ్ జోహార్ గురించి చర్చ ఎందుకు? వెళ్లి అతడినే అడగండి. మరేదైనా ముఖ్య విషయం వుంటే అడగండి. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకే నేను ఇక్కడికి వచ్చాను. వెళ్లి అతడిని చితక్కొట్టండి. ఈ విషయంలో నన్నేమీ అడగొద్దు’’ అని వీకే సింగ్ వ్యాఖ్యానించారు.