: మల్కాజ్ గిరి టీడీపీ ఇన్ చార్జ్ రాజీనామా!
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపు విషయంలో మనస్తాపం చెందిన మల్కాజ్ గిరి టీడీపీ ఇన్ చార్జ్ వీకే మహేశ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి తాను చేసిన సేవలను టీడీపీ గుర్తించ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపు విషయంలో మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి తీరు తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని.. అందుకే తాను రాజీనామా చేశానని మహేశ్ అన్నారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఆశించిన పలువురు అభ్యర్థులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల కార్యాలయాల ముందు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే.